Tv424x7
Telangana

అయోధ్య నుంచి కొండగట్టుకు రాముడి బాణం

జగిత్యాల జిల్లా:జూన్ 30అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ఈరోజు ఉదయం కొండ గట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు.ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకువెళ్లి బాలరాముడికి సమర్పి స్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన ట్లు తెలిపాడు. కార్యక్రమం లో ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు..

Related posts

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

TV4-24X7 News

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

TV4-24X7 News

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

Leave a Comment