Tv424x7
Telangana

అయోధ్య నుంచి కొండగట్టుకు రాముడి బాణం

జగిత్యాల జిల్లా:జూన్ 30అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ఈరోజు ఉదయం కొండ గట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు.ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకువెళ్లి బాలరాముడికి సమర్పి స్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన ట్లు తెలిపాడు. కార్యక్రమం లో ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు..

Related posts

జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

TV4-24X7 News

పాశమైలారం ఘటనలో 40 మంది మృతి: సిగాచీ పరిశ్రమ

TV4-24X7 News

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ మృతి!!

TV4-24X7 News

Leave a Comment