ఆళ్లగడ్డ టౌన్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి ఆళ్లగడ్డ నియోజకవర్గం బలిజ సంఘం అధ్యక్షులు నల్లగట్ల బాలుడు, డాక్టర్ ఎం వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బలిజ సంఘీయులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గెలుపొందిన భూమా అఖిలప్రియ గారికి ఆళ్లగడ్డ నియోజకవర్గం బలిజ సంఘీయులు శుభాకాంక్షలు తెలియజేశారు. భూమా అఖిలప్రియ గారి గెలుపులో అన్ని వర్గాలతో పాటు బలిజ వారు కూడా ముఖ్య పాత్ర పోషించారని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లలోను, నామినేటెడ్ పోస్టులలోను బలిజ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరు మండలాలలో కమ్యూనిటీ హాల్లు నిర్మించాలని ఆళ్లగడ్డ నియోజకవర్గం టిడిపి నాయకులు మద్దూరు భార్గవ్ రామ్ గారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బలిజ సంఘీయులు యామ గుర్రప్ప, సుబ్బరామిరెడ్డి, పత్తి సత్యనారాయణ, సిద్ధి సత్యం, శెట్టి వేణు, గుత్తి నరసింహుడు, మైలేరి మల్లయ్య, అర్జీ గారి నరసింహుడు, ఆకుల వెంకటసుబ్బయ్య, వెంకటస్వామి, సిద్ది నారాయణ, రాందాస్, జిల్లా సుబ్బరాయుడు, బాచుపల్లి నారాయణ, ఏరువ కృష్ణమూర్తి, నాగప్రవీణ్, శీను, మోహన్, వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, బావికాడి గురప్ప, శ్రీరాములు, చైతన్య, అర్జీగారి శీను, ఈశ్వరయ్య, మంగమ్మ గారి ప్రసాద్, యమ శ్రీకాంత్, రాజేష్, గోవర్ధన్, లక్ష్మీ నరసయ్య, నీలి వెంకటేశ్వర్లు, గురు ప్రసాద్ తదితరులు దితరులు పాల్గొన్నారు.
