ప్రాణాపాయం నుంచి దేవుడే తనని రక్షించాడని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వెంట్రుక వాసిలో మృత్యువు నుంచి బయటపడ్డానని తెలిపారు. అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అల్లర్లు చోటు చేసుకోకుండా సంయమనం పాటించాలని కోరారు. “ఊహించని పరిణామం నుంచి ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా అమెరికా ప్రజలంతా ఐక్యం కావాలి” అని సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ పిలుపునిచ్చారు.

previous post
next post