Tv424x7
National

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

ఒడిశా :జులై 15ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి.ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి స్వామి వారి బాహూదా రథయాత్ర కొనసాగుతుంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మంది భక్తులు తరలిరావ డంతో పూరీ ప్రాంతం జనసంద్రంగా మారనుంది . 12రోజుల పాటు ఉత్సవా లు జరుగుతాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ మైన పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం.. ప్రతీ యేటా ఆషాడ శుద్ధ తదియ రోజున ప్రారంభమవు తుంది.ఏ హిందూ ఆలయం లోనై నా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ, పూరీ జగన్నాధుని ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్ర లో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయా త్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని ‘నంది ఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మ ధ్వజం’ అని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరి స్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భ గుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది..

Related posts

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

TV4-24X7 News

ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?

TV4-24X7 News

Leave a Comment