తిరుపతి : ఒకే కుటుంబంపై దాడి ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ రాయల్ నగర్లో నివసిస్తున్న వ్యాపారి కుటుంబంపై గుర్తుతెలియని యువకులు ఇంటిలోకి జొరబడి వృద్ధురాలి పీకకోశారు. అడ్డం వచ్చిన నీతి, ప్రేరణ అనే యువతులను సైతం గొంతు కోసి పరారయ్యారు. యువతులను ఆసుపత్రికి తరలించగా నీతి పరిస్థితి విషమంగా ఉంది. రెండేళ్ల క్రితం ఇదే విధంగా కుటుంబంపై దాడి జరగడం గమనార్హం.
