విశాఖపట్నం దాకమర్రి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ నందు హెల్త్ ఆఫీసర్ గా పనిచేయుచున్న అరిలోవకు చెందిన బడిగంటి. ప్రణీత సైని అను ఆమె మంగళవారం ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో దాకమర్రి జంక్షన్ వద్ద బస్సు దిగి డ్యూటీ కి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి బుల్లెట్ మోటార్ సైకిల్ పై వచ్చి తన మెడలోని అర తులం బంగారు చైన్ తెంపుకుని పోయినట్లు పిర్యాదు. చేసారని అలాగే బుధవారం సాయంత్రం 04.00 గంటల సమయంలో విజయనగరం జిల్లా, చీపురుపల్లి కి చెందిన వాడరేవు సుజాత అను ఆమె తగరపువలస శశి స్కూల్ లో చదువుతున్న తన కుమారుడిని కలిసి తిరిగి వెళ్ళుటకు బస్సు కోసం ఎదురుచుస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి తన మెడలోని బంగారు పుస్తుల తాడు మరియు నల్ల పూసల దండలో బాగం సుమారు రెండున్నర తులాలు తెంపుకుని పోయినట్లు పిర్యాదు చేసే నట్లు పోలీసులు తెలిపారు. పై కేసుల దర్యాప్తు లో బాగంగా శంక బ్రతా బాగ్చీ, కమీషనర్ అఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, పి. వెంకట రత్నం, డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్,క్రైమ్స్, విశాఖపట్నం సిటీ, ఎ. వెంకట రావు, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, క్రైమ్స్ (జోన్-1),విశాఖపట్నం సిటీ వారి సూచనల మేరకు, జి.రాంబాబు, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, నార్త్ సబ్-డివిజన్, క్రైమ్స్ అధ్వర్యంలో ఏ.ఎస్ సూర్య ప్రకాశ రావు, సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, క్రైమ్స్, భీమిలి పోలీస్ స్టేషన్ వారి సిబ్బందితో ప్రత్యెక బృందాలుగా ఏర్పడి పై కేసులో ముద్దాయిలైన గంగులు, కోయిలాడ సాయి కిరణ్, విశాఖపట్నం వాన్ వ్యులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చోరి సొత్తు 03 తులాల బంగారు ఆభరణములు మరియు నేరమునకు విని యోగించిన మోటార్ సైకిల్ లను సీజ్ చేసి ముద్దా యిలను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.వారిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలియజేశారు. పై కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఉన్నతాదికారులు అభినందించారు.
