సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన పోలీసులువిశాఖపట్నం మానసిక రుగ్మత కారణంగా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మహిళను ప్రజల సహాయంతో పోలీసులు కాపాడారు. అక్కయ్యపాలెంలో నివాసం ఉంటున్న ఒక మహిళ తన మానసిక రుగ్మత కారణముగా ఆత్మ హత్య చేసుకోవడానికి ఆర్కే బీచ్ ఏరియా వద్ద బీచ్ లోనికి ప్రమాదకరంగా వెళ్ళింది. దీంతో ప్రజలు గమనించి వెహికల్ చెకింగ్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను కలిసి తక్షణం సదరు మహిళను నిలువరించి ఆత్మహత్య నుండి కాపాడారు. ఆమె మానసిక ఆరోగ్యం కోసం మెడిసన్స్ వాడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు బాదితురాలికి కౌన్సిలింగ్ చేసి, తన భర్త కాటరాజు కి అప్పగించారు. తక్షణం స్పందించి, సకాలంలో బాదితురాలను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్బి అభినందించారు.

previous post
next post