గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు
ప్రారంభించి పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు దంపతులు
ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తుంది అన్న క్యాంటీన్
గుడివాడ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హెలి కాప్టర్‌లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్‌ను ప్రారంభిం చారు. అంతకు ముందు ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అధికారులు.అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ప్రజలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పేదలతో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భోజనం చేశారు. పేదలలో మాట్లాడి వారి కష్టాల గురించి తెలుసుకున్నారు. పేదలతో పాటు అన్న క్యాం టీన్‌లో ఏర్పాట్లను పరిశీలిం చారు. పేదలకు భోజనం వడ్డించారు చంద్రబాబు దంపతులు.ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజ నం అందిస్తుంది, అన్న క్యాంటీన్. ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతి నిధులు ఆయా నియోజక వర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి…