Tv424x7
Andhrapradesh

వైభవోపేతంగా శ్రీ పట్టాభి రామస్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవములు…

కడప జిల్లా బద్వేల్ డివిజన్ గోపవరం మండల పరిధిలోని చెన్నవరం గ్రామంలో బుధవారం శ్రీ పట్టాభిరామ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవములు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి… వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛరణల మధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మరియు వజ్ర ప్రతిష్ట మహోత్సవములు కన్నుల పండుగ జరిగాయి.. వేకువ జాము నుంచే గోపూజ యాగశాల ప్రవేశము గణపతి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవములు ఘనంగా జరిగాయి.. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం సాయంత్రం స్వామివారికి అశేష భక్త జనం మధ్య గ్రామత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు నిలిచాడు అన్నారు… అందుకే ప్రతి వాడలోను శ్రీ రాముని మందిరాలు ఉన్నాయని శ్రీరాముడు చూపిన బాటలో నడవగలిగితే మన జన్మ ధన్యం అవుతుందని వారు పేర్కొన్నారు..

Related posts

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

TV4-24X7 News

ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు అన్యాయాలు చేసినోళ్ళని చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతాం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

TV4-24X7 News

Leave a Comment