Tv424x7
Telangana

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసు కోగా, అంబారీపేట్‌కు చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామా రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

మహిళలకు నెలకు రూ.2,500.. ఎప్పుడంటే?

TV4-24X7 News

ఆలమట్టిపై కేటీఆర్‌వి పిచ్చి మాటలు!!

TV4-24X7 News

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం….

TV4-24X7 News

Leave a Comment