విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో గల స్థానిక 32 వ వార్డులలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అవార్డు కార్పొరేటర్,విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు కందుల నాగరాజు జివిఎంసి కమిషనర్ పి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.శనివారం ఉదయం 32 వ వార్డులో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అలాగే కందుల నాగరాజు ఇతర సిబ్బంది పర్యటించారు.వార్డులో గల పలు సమస్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ 32వ వార్డులో గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు డ్రైన్స్ డెవలప్మెంట్ చెయ్యాలని కోరారు అలాగే. సమీపంలో గల సిపిఐ ఆఫీస్ వద్ద నిరుపయోగంగా ఉన్న జీవీఎంసీ రోడ్డు 30 ఏళ్లుగా కబ్జాకు గురైందన్నారు.ఇక్కడ రాత్రి పగలనే తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఇక్కడ కళ్యాణమండపంతో పాటు అలాగే పిల్లలకు ప్లేగ్రౌండ్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఏడుగుళ్ళ ప్రాంత సమస్యను పరిష్కరించాలని చెప్పారు.75 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధి లేకుండా ఉందన్నారు.ఇక్కడ వాళ్లకు సొంత ఇంటి కలలు నెరవేర్చాలని తెలిపారు.ఇప్పటికే ప్రైవేట్ ఇక్కడ ఇళ్ల నిర్మాణం కోసం మాట్లాడటం జరిగిందని దీనిపై జీవీఎంసీ అధికారులు దృష్టి సారించాలని ఇక్కడ స్థానికులకు అండగా నిలవాలని కోరారు.అలాగే అల్లిపురం బజార్లో సరైన సదుపాయాలు లేక అక్కడ వ్యాపారస్తులు పలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు.ఇక్కడ వ్యాపారస్తులకు సరైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా సౌత్ జైల్ రోడ్డు లో ఉన్న డబుల్ రోడ్డు ప్యాచ్ వర్క్ ను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఇక్కడ విద్యుత్తు లైట్లు సరిగ్గా వెలగడం లేదని ఈ సమస్యను కూడా పరిష్కరించాలని అన్నారు.తారకరామా కాలనీలో ప్రస్తుతం వాడుకలో ఉన్న బిల్డింగును కళ్యాణ మండపం గా మార్చాలని చెప్పారు.అలాగే చలువ తోటలో నిర్మాణంలో ఉన్న కళ్యాణమండపం 2వ ఫ్లోర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ.32వ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ వెల్లడించారు.ఏడు గుళ్ళ ప్రాంత సమస్య అలాగే చలువు తోట కళ్యాణమండపం 2వ ఫ్లోర్ సమస్య అదే విధంగా అల్లిపురం, సౌత్ జైల్ రోడ్, నేరెళ్ల కోనేరు ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానన కందుల నాగరాజుకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు,డాక్టర్ కృష్ణంరాజు, ఎస్ ఎస్ కె కిషోర్ కుమార్, ఎస్సై ఎం కాశీ రావు, ఏఈ పార్వతి, 32 వ వార్డు సెక్రటరీలు, అలాగే శాలివాహన , కొట్నాల రమేష్,నీల బాబు,అప్పారావు, పడి రమేష్, సిపిఐ బుజ్జి,ఎల్లపు ఆది బాబు, చిట్టి, కేదార్నాథ్, బద్రీనాథ్, అర్జున తదితరులు పాల్గొన్నారు.

previous post