విశాఖపట్నం గౌరీ సేవా సంఘం, శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ గౌరీ పరమేశ్వరుల లీలా మహోత్సవ పందిరి రాట మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. అల్లిపురం వెంకటేశ్వర స్వామి మెట్ట వద్ద ప్రతి ఆట అంగరంగ వైభవంగా జరుగుతున్న లీలా మహోత్సవం నేటికి 76 వసంతాలు పూర్తి చేసుకుందని వాసుపల్లి తెలిపారు. స్థానిక కమిటీ, స్థానికుల సమక్షంలో ఆధ్యాత్మికంగా జరిగే ఈ మహోత్సవానికి తన ద్వారా శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. అక్టోబర్ 26వ తేదీన గురువారం అమ్మవారిని నిలపడం జరుగుతుందనీ, అలాగే నవంబర్ 23వ తేదీన అనుపు కార్యక్రమం వైభవంగా జరుగుతాదన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొలమర శెట్టి వెంకట శ్యాం కుమార్, ప్రధాన కార్యదర్శి సన్యాసిరాజు, కోశాధికారి సూరిశెట్టి నర్సింగరావు, స్థానిక వైసీపీ నేత ముత్తాబత్తుల రమేష్, తదితరులు వాసుపల్లికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, 33వార్డు వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

next post