Tv424x7
Andhrapradesh

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సీఐ రేవతమ్మ

విశాఖపట్నం యువత లక్ష్యం నెరవేరాలంటే కచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని టూ టౌన్ ట్రాఫిక్ సిఐ రేవతమ్మ అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు పాడుచేసుకుని తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చిన వారవుతారన్నారు. జీవీఎంసీ హై స్కూల్ లో కన్నయ్య పేట డ్రగ్స్ దుష్ఫలితాలు మరియు మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, హెల్ప్మెంట్ తప్పనిసరిగా ఉండాలి, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలి అనే అంశంపై విద్యార్థులకు అవ గాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్లతో ఆర్థికంగా చితికి పోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యువత కష్టపడి పైకి రావాలే తప్పా అడ్డదారుల్లో ముందుకు వెళ్లాల సుకోవడం మంచి పరిణామం కాదన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ ఐ లక్ష్మి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

దివ్య ఫార్మసీ (పతంజలి) ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ రద్దు

TV4-24X7 News

దువ్వూరు లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల ఘనారంభం

TV4-24X7 News

అల్ ఇందాద్ సేవ ట్రస్ట్ అధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణకు అవగాహన ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment