దువ్వూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారి దివ్యరూపాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ – దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు భిన్న భిన్న అలంకరణలతో దర్శనమిస్తారని, భక్తులు తప్పకుండా పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కోరారు.
✨ రాబోయే రోజుల్లో దుర్గా దేవి, మహిషాసుర మర్ధిని, అన్నపూర్ణేశ్వరి, లలితా త్రిపుర సుందరి రూపాల్లో అమ్మవారు అలంకరించబడతారని నిర్వాహకులు తెలిపారు.

