Tv424x7
Andhrapradesh

ట్రాఫిక్ రూల్స్ పై పవన్ కళ్యాణ్ సందేశం

అమరావతి : డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. వాహనదారులు కేవలం కొన్ని సెకన్ల ఓపిక లేకుండా ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయని, అలాంటి నిర్లక్ష్యం భవిష్యత్తులో కుటుంబాలకు తిరిగిరాని దెబ్బతీస్తుందని ఆయన హితవు పలికారు.

🚦 “తల్లి గర్భంలో 9 నెలలు వేచి ఉంటాం, నడవడానికి 2 సంవత్సరాలు, ఓటు హక్కు కోసం 18 సంవత్సరాలు, ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు ఆగుతాం… కానీ డ్రైవింగ్ లో కేవలం 30 సెకన్లు ఆగలేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి” అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.

వాహనాలు నడుపుతున్నప్పుడు సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, వాహనాలను నియంత్రణలో ఉంచుకొని నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

👉 “ముందు వెళ్ళేవారు వెళ్ళనివ్వండి.. వెనకాల హాయిగా వెళ్లిపోండి. మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తగా ప్రయాణించండి. మీ ఇంటి వద్ద మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

📌 డ్రైవర్లు చిన్నపాటి అజాగ్రత్తతోనే పెద్దపాటి ప్రాణ నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ, రహదారులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ మరోసారి పిలుపునిచ్చారు.

Related posts

విజయసాయిరెడ్డి తో వాసుపల్లి కలయిక

TV4-24X7 News

వన్ టౌన్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన సి.పి

TV4-24X7 News

పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

TV4-24X7 News

Leave a Comment