విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసంలో మత్స్యకర నాయకులు బాధితులతో పాటు మర్యాదపూర్వకంగా కలుసుకొని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా జీవో నెంబర్ 369 ద్వారా 36 ఫిషింగ్ బాట్లకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి కోటిమప్పై ఐదు లక్షల రూపాయల నిధులను 36 బోట్ల యజమానులకు అందజేయాలని, ప్రభుత్వానికి నివేదిక పంపించి నిధులు మంజూరు కాకుండా 2019 నుంచి వేట చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయినటువంటి 15 ఫిషింగ్ బోట్లకు కూడా నష్టపరిహారం అందజేయాలని ఎమ్మెల్యే కి తెలియచేయడం జరిగింది. 2017- 2020 సంవత్సరాల మధ్యన దాదాపుగా 300 ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ బకాయిలకు ఉన్నటువంటి 2,77,03,883/- (రెండు కోట్ల 77 లక్షల మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు) డీజిల్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 176 2024 నాడు విశాఖ నుంచి వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పూలు మనకు వద్ద అగ్నికి ఆహుతి పూర్తిగా కాలిపోయినటువంటి IND-AP-V5-MM- 17 నెంబర్ ఫిషింగ్ బోటుకు మత్స్య శాఖ అధికారులు 20,50,000/-( 20 లక్షల 50 వేల రూపాయలు) నష్టపరిహారంగా అంచనా వేశారు. కావున పూర్తి నష్టపరిహారాన్ని బాధిత బోటు యజమానికి అందించడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చం నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా అందజేసే విధంగా కృషి చేయాలని, మత్స్యకారుల జీవితాలు నిలబెట్టాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందిస్తూ బుధవారం మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ తో ఈ సమస్యలపై సమావేశమై పూర్తిగా బాధితులందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

