Tv424x7
Andhrapradesh

| సూసైడ్ స్పాట్ గా మారుతున్నదా..? “ఎస్ఆర్ఐటి” కళాశాల…

బుక్కరాయసముద్రం▪️అనంతపురం జిల్లా

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

గతంలో కూడా ఇదే కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

అప్పటి ఘటనలో కూడా పోలీసులు, అధికారులు, విద్యార్థి సంఘాలు పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.▪️

గత వైసీపీ ప్రభుత్వం ఈ కళాశాలకు హై సెక్యూరిటీ కల్పించగా… ఇప్పుడు వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం చూడనట్టే వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.▪️

ఎస్ఆర్ఐటి కళాశాలలో ఎందుకు వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..? అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది.▪️

ఈ ఘటనలపై విచారణ జరగకపోవడమే కాకుండా, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి పేరు వినిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పై టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వస్తున్నాయి.▪️

విద్యార్థుల ప్రాణాలు బలి అవుతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది.▪️

స్థానిక లీడర్లు కూడా ఈ అంశంపై నోరు మెదపకపోవడం, తల్లిదండ్రులు బహిరంగంగా ఫిర్యాదు చేసేందుకు వెనుకాడటం చర్చనీయాంశమైంది.👉

ఎస్ఆర్ఐటి కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక నిజాలు ఏమిటి..? దీనిపై నిజమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

TV4-24X7 News

రేపు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన….

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదంపై కొప్పాల రఘు ఆవేదన!!

TV4-24X7 News

Leave a Comment