Tv424x7
National

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి

న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది.జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించింది.ఈ బిల్లు ఆక్సెప్ట్ అవ్వాలి అంటే లోక్ సభ,రాజ్య సభ లో 67% మంది సపోర్ట్ చెయ్యాలి.14 రాష్ట్రాలు అసెంబ్లీ లు సపోర్ట్ చెయ్యాలి.అలా మద్దతు ఇస్తే బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది.ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెoటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది.ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుంది.దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Related posts

జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తు ఇక సులువు

TV4-24X7 News

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

TV4-24X7 News

త్వరలో BSNL 5జి నెట్వర్క్

TV4-24X7 News

Leave a Comment