Tv424x7
Andhrapradesh

మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్ట్ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

కడప: మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలో నిందితుడు విగ్నేష్ ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ పురానికి చెందిన విగ్నేష్ కు దస్తగిరమ్మ మధ్య ఐదు సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని, కానీ విగ్నేష్ ఆరు నెలల క్రితం మరో అమ్మాయితో వివాహం చేసుకోవడంతో వారి ప్రేమ వ్యవహార మధ్య బ్రేక్ పడిందన్నారు .కానీ విగ్నేష్ దస్తగిరమ్మను వదిలించుకోవాలని ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం పి పి కుంట సమీప అటవీ ప్రాంతంలో రహస్యంగా కలుసుకోవాలని చెప్పగా, శనివారం ఉదయం దస్తగిరమ్మ బీజే ఎస్సార్ కళాశాల నుండి ఆటోలో బయలుదేరింది. పాలిటెక్నిక్ కళాశాల వద్ద విగ్నేష్ అదే ఆటోలో ఎక్కి సెంచరీ ఫ్యాక్టరీ సమీపంలో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పై లైంగిక దాడికి పాల్పడి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ప్రాణ భయంతో దస్తగిరమ్మ కేకలు వేయడం, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మైనర్ బాలికను హుటాహుటిన చికిత్స నిమిత్తం బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తీసుకొని రాగా ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ దస్తగిరమ్మ ప్రాణాలు విడిచిందని ఎస్పీ తెలిపారు. దస్తగిరమ్మ ఇచ్చిన మరణ వాంగ్మూల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చేపట్టామని, నిందితుడిని కడప బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మైనర్ బాలిక పై జరిగిన దాడి కేసుల 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకోవడంలో విశేష కృషి చేసిన మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ ను , బద్వేల్ రూరల్ సీఐ నాగ భూషణం, గోపురం ఎస్ఐ శ్రీ కాంత్ లను ఎస్పీ అభినందించారు.

Related posts

పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ రాజీనామా

TV4-24X7 News

డిజేబులు రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవ వారోత్సవాలు

TV4-24X7 News

విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా

TV4-24X7 News

Leave a Comment