విశాఖపట్నం పోలిస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఆదివారం స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.డి బాబు (దేముడు బాబు) ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ.సి.పి టి.త్రినాధ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థి, విద్యార్థిని లకుసర్కిల్ ఇన్స్పెక్టర్ జి.డి.బాబు, ఎస్.ఐ లు స్టేషన్ ఫంక్షనింగ్ గురించి వివరించారు. 303 రైఫిల్, ఎస్. ఎల్. ఆర్. ఇన్సాస్, ఎ.కె. 47, 9 ఎమ్. ఎమ్ కార్బన్, గ్యాస్ గన్, యాంటి రైడ్ గన్, పిస్టల్, రివాల్వర్, గ్రెనేటు, ఎల్.ఎమ్.జి మరియు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కమ్యూనికేషన్స్ విభాగాల గూర్చి క్షుణ్ణంగా తెలియజేశారు.ఆయుధాలు గురించి. పి.సి.చారి, ఏ.ఆర్.ఎస్.ఐ వెను,పి.సి మల్లేష్, కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి హరిబాబు, బాంబ్ డిటెక్షన్ అండ్ దిస్పోజల్ స్క్వాడ్ (బి.డి.డి.ఎస్ టీం) గురించి వెంకట్రావు,బంగారి,కె9 టీం డాగ్ స్క్వాడ్ గురించి పి.తాతారావు స్టేషన్ ఫంక్షనింగ్ కోసం సి. ఐ,ఎస్.ఐ లు వివరించారు.

previous post