Pollution | న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది.అయితే ఇంత జరిగినా కాలుష్యం అనుకున్నంత తీవ్రంగా ఏమీ దిగజారలేదంటూ ఢిల్లీ మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. దీపావళి సందర్భంగా టపాసుల వినియోగంపై పలు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా విచ్చలవిడిగా వాటిని కాల్చారు.
