మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్ ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్లోనే ఏకంగా 85లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందక పోయినప్పటికీ ఐటీ నిబంధనలను అతిక్రమించినందున చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
