Tv424x7
Andhrapradesh

పుర్రి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి

విశాఖపట్నం దక్షిణ పేద ప్రజలకు తానున్నానంటూ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ చెయ్యందిస్తున్నారు. అధికారంలో లేకున్నా ఆగని సాయం దక్షిణ ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. వారికి కష్టమైనా, పండగ అయినా, శుభకార్యమైన దక్షిణ ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే. వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై భరోసాగా నిలబడుతున్నారు. 35 వార్డులో ఇటీవల చనిపోయిన పుర్రి దుర్గాప్రసాద్ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అలాగే తన వంతు సాయంగా రూ.10 వేలు అందజేశారు. అందువచ్చిన కొడుకు దూరం కావడం చాలా బాధాకరమన్నారు. పుర్రి దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మీది బలిజ సంఘమా ? లేక వైస్సార్సీపీ అనుబంధ సంఘమా..?

TV4-24X7 News

దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ యాదవ్ కి శ్రీ జగన్నాథ్ స్వామి రథయాత్ర ఉత్సవ కమిటీ మెంబర్స్ ఘన సత్కారం

TV4-24X7 News

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు

TV4-24X7 News

Leave a Comment