Tv424x7
Andhrapradesh

నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన కనోయింగ్ & కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు

నంద్యాల జిల్లా కనోయింగ్ & కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్వంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో నంద్యాల చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ & కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, రామకృష్ణ విద్యాసంస్థలు అదినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, ఐఎంఎ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ డా. మధుసూదన్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఈ పోటీలు నంద్యాలలో జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. ఈ క్రీడను నంద్యాలలో ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, క్రీడా మంత్రికి తమ తరఫున వినతిపత్రం అందజేస్తామన్నారు. ఎఎస్పీ యుగంధర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను క్రీడలపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ పోటీలు అదివారంతో ముగియబోతున్నాయని నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మెహమ్మద్ రఫి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు.

Related posts

రైతులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు భరోసా

TV4-24X7 News

ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

TV4-24X7 News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

TV4-24X7 News

Leave a Comment