Tv424x7
Andhrapradesh

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

అమరావతి: మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్‌ వస్తుందని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసనసభలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు..”ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చాం. అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించాం. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్‌ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం.. కానీ అది ఆగిపోయింది. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్‌ జరగలేదు.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు..బాధాకరమైన పరిస్థితి ఏంటంటే.. గతంలో హైదరాబాద్‌లో రేస్‌ జరిగింది. దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి.. కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారు. ఆరోజు నుంచి ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అవమానం జరిగింది. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మేం ఐటీ సంస్థల వాళ్లందరితో సమావేశమయ్యాం. సమస్యలు తెలుసుకున్నాం. సీఎం చంద్రబాబు (Chandrababu) చొరవ వల్ల ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం” అని నారా లోకేశ్‌ చెప్పారు..

Related posts

పవన్ తో జగన్ కి పోలిక ఏంటీ..పవన్ కి అంత సీన్ లేదు: ఉండవల్లి

TV4-24X7 News

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఎస్సై రామకృష్ణ

TV4-24X7 News

ఏపీలో కొత్త పార్టీ ప్రకటించిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

TV4-24X7 News

Leave a Comment