Tv424x7
Andhrapradesh

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి వాసుపల్లి రూ. 5 వేలు సాయం

సూపర్ సిక్స్ ను తక్షణమే అమలు చేయాలి

జగనన్న ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగించాలి

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖపట్నం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదుకున్నారు. పేదవాళ్లకి అందిస్తున్న సహాయ సహకారంలో భాగంగా 38 వ వార్డుకు చెందిన చేపల బంగారు రాజుకు రూ. 5 వేలు ల నగదు ను మంగళవారం ఆశీలమెట్ట కార్యాలయంలో వాసుపల్లి అందజేశారు. మదర్ థెరిస్సా, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పేదలకు అందిస్తున్న ఆర్థిక సాయం తనకెంతో సంతృప్తినిస్తుందని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి మెరుగైన విద్యా, వైద్యం పేదలకు అందించారని, అలాగే ప్రతి మధ్య పేద తరగతి కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు రూపాయి అవినీతి లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి అర్థ సంవత్సరం గడిచినప్పటికీ పేదవాడికి ఒక్క సంక్షేమం కూడా అందలేదని విమర్శించారు. జగనన్న హయంలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన మెడికల్ కాలేజీలు, నూతన పోర్టు నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు అందాల్సిన భరోసా, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలిచ్చీ ఆరు నెలలు గడుస్తున్న ఒక్క సిక్స్ కూడా కొట్టలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసి జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు పేదలకు చేరవేసేలా చూడాలని హితవు పలికారు.కార్యక్రమంలో 37 వార్డు కార్పొరేటర్ జానకిరామ్, 29 వార్డు అధ్యక్షులు పీతల వాసు, 35 వార్డు అధ్యక్షులు కనకా రెడ్డి, లింగం శ్రీను, దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అప్పారావు, గనగళ్ల రామరాజు, చింతకాయల వాసు ఆకుల శ్యామ్ తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Related posts

పటాన్ చెరులో పవన్… మ్యాటరేంటి అంటే…..

TV4-24X7 News

ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

TV4-24X7 News

తొలి ట్రెండ్స్ లో కూటమికే ఆధిక్యం…!

TV4-24X7 News

Leave a Comment