Tv424x7
Andhrapradesh

నోటీసు ఇస్తేనే విచారణకు వస్తా: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

పులివెందుల: సోషల్‌ మీడియా కేసులో విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నాడు..కడప కోర్టులో ముందస్తు బెయిల్‌కోసం పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 12 వరకు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఈ నేపథ్యంలో నిందితుడు రాఘవరెడ్డి ఆదివారం పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విషయం తెలుసుకున్న పులివెందుల పోలీసులు.. విచారణకు రావాలని అతడి ఇంటికి వెళ్లారు. మౌఖికంగా చెబితే రానని, నోటీసు ఇస్తేనే విచారణకు వస్తానని రాఘవరెడ్డి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకోము.. విచారణకు సహకరించాలని పోలీసులు పలుమార్లు కోరినా రాఘవరెడ్డి మాత్రం నోటీసు ఇస్తేనే విచారణకు వస్తానని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ప్రస్తుతం వర్రా రవీందర్‌రెడ్డి కేసులో పవన్‌ కుమార్ అనే వ్యక్తిని డీఎస్పీ మురళీ ప్రశ్నిస్తున్నారు..

Related posts

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

18 లక్షలు – 12 ఎకరాలు: బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు సాయం!

TV4-24X7 News

భూ దందాల ఆదిపత్య పోరుతోనే శేషాద్రి హత్య … డిఎస్పీ

TV4-24X7 News

Leave a Comment