.అన్నమయ్యజిల్లా, రాజంపేటలోని గాంధీ విగ్రహం కూడలి నందు బిజెపి పార్టి ఆధ్వర్యంలో నేడు ఫలితాలు వెలుబడిన ఐదు రాష్ట్రాలు ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాల్లో బిజెపి అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని ఆనందాల వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో మూడు రాష్ట్రాల్లో బిజెపిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని పరిపాలన చేస్తున్న భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉండడానికి శక్తివంతన లేకుండా ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వ పట్ల ప్రజలు చూపించిన విశ్వాసం అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మూర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, బిజెపి రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాదెల శ్రీనివాసులు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు పెనుగొండ రమణ భవిశెట్టి రెడ్డయ్య, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మరియు ఆర్టిఐ జిల్లా సెల్ కన్వీనర్ పి .మహేష్, బిజెపి నాయకులు రాజేష్ హరి సురేష్ తదితరులు పాల్గొన్నారుఫోటో…. సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నాయకులు.

previous post