బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐ.టి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తన కార్యకర్తలతో పాల్గొనడంతో పాటు స్వయంగా తానే రక్తదానం చేశారు. అనంతరం డాబాగార్డెన్స్ ప్రేమసమాజంలో నిరాశ్రయులైన వృద్ధులు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి మధ్యాహ్న భోజనం వితరణ చేశారు, దీంతోపాటు వృద్ధులకు పండ్లు పంపిణీ మరియు చిన్నారులకు చాక్లెట్లు బిస్కెట్లతో పాటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం అందరితో స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.