అమరావతి : కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించే ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు.
