Tv424x7
National

ప్రపంచంలోనే అతి పెద్ద గూడ్స్ రైలు గురించి విశేషాలు తెలుసా..?

సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండ ఏ ప్రాంతం నుంచి.. ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండను లాగేందుకు 6 ఇంజిన్‌లు పని చేస్తాయి. ఇంతకీ అదేంటంటే..సూపర్ వాసుకి.. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు. ఈ రైలుకు 15-20 కాదు ఏకంగా 295 కోచ్‌లు ఉన్నాయి. ఇక ఆ కోచ్‌లను లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్లు పని చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే.. దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ సూపర్ వాసుకి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. దేవతులు, రాక్షసుల మధ్య సాగరాన్ని మథించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు, అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట.

Related posts

బడ్జెట్‌ సమావేశాలకు ముందు 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో పార్లమెంట్‌లో భద్రత

TV4-24X7 News

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేతగువహటి

TV4-24X7 News

రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం!

TV4-24X7 News

Leave a Comment