Tv424x7
Andhrapradesh

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లపై సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా 5 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.అయితే, 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులని గుర్తించినట్టు వివరించారు. వారందరికీ మే నెలనుంచి పింఛన్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Related posts

ఇకపై మూడు నెలలకోసారి పెన్ష‌న్లు..!

TV4-24X7 News

భారత్ లో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా..

TV4-24X7 News

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

TV4-24X7 News

Leave a Comment