Tv424x7
Andhrapradesh

రాయచోటిలో ఘనంగా రంజన్ వేడుకలు…

అన్నమయ్య జిల్లా రాయచోటిలో రంజాన్ ముగింపు వేడుకలు ముస్లిం మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని హజరత్ జమాలుల్ల ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్ధనలకు గౌరవ ప్రెసిడెంట్ బేపారి బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్ కమిటీ సభ్యులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈదుగాలో జరిగే ప్రార్థనలకు ముస్లిం సోదరులు ఉదయమే భారీగా చేరుకున్నారు. మత గురువు సర్కాజి సర్పుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించారు. ఈ ప్రార్థనలో వైఎస్ఆర్సిపి మైనార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాపారి బషీర్ ఖాన్ కలిసి వారి ఆరోగ్య స్థితి గతులను అడిగి తెలుసుకుని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.ఈ సందర్బంగా వారు మట్లాడుతూ పవిత్రమైన రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు నెలరోజుల పాటు ఉపవాసదీక్షలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. స్నేహం, కరుణ, క్షమ, క్రమశిక్షణ, దయాగుణాలకు ప్రతీకగా నిలిచే రంజాన్‌ పర్వదినం మానవాళిని ఆదర్శంతంగా తీర్చిదిద్దబడుతోందని అన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరు సంతోషకంగా గడపాలని ఆకాంక్షించారు.

Related posts

రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

TV4-24X7 News

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్

TV4-24X7 News

ఏపీ బడ్జెట్‌లో మత్య్సకారులకు మొండి చెయ్యే

TV4-24X7 News

Leave a Comment