Tv424x7
Andhrapradesh

నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సా లను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీ లతో పాటు వాహన సేవల వివరాలను వెల్లడించింది. నేటి సాయంత్రం అంకురా ర్పణ తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. రేపు శ్రీరామ నవమి రోజున ధ్వజరోహణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి,బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

ఏప్రిల్ 11న రాములోరి కల్యాణం…ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభు త్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయం తో పని చేస్తూ.. ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నా రు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వ హిస్తున్నారు. ఏర్పాట్లపై టీటీడీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్ర తా, క్యూలైన్లు, అన్నప్రసా దాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం

TV4-24X7 News

సముద్రంలో పిడుగు బోటు పై పడి మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

TV4-24X7 News

Leave a Comment