Tv424x7
Andhrapradesh

వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధం?

అమరావతి:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మద్యం కేసుకు సంబంధించి ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది సెప్టెంబర్ లో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల మిథున్ రెడ్డి, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, మిథున్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. విచారణ సమయంలో మద్యం విదానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఏపీ సీఐడీ హైకోర్టుకు తెలిపింది. మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని తెలిపింది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.అయితే, తాజాగా.. ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీ వెళ్లాయి. ఎంపీ మిథున్ రెడ్డి,అరెస్టుకు ఢిల్లీలో రంగంలో చేసినట్లు తెలు స్తోంది. ఆయన్ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చే పనిలో సీఐడీ బృందం నిమగ్నమైనట్లు సమాచారం.

Related posts

ప్రొద్దుటూరులో వాలంటర్ల రాజీనామా

TV4-24X7 News

కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు!!

TV4-24X7 News

పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

TV4-24X7 News

Leave a Comment