నంద్యాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో నెరవాడ గ్రామంలో ఉన్న కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన బచ్చు చక్రపాణి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ..
పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో ఉన్న కేశవరెడ్డి స్కూల్లో మా ఇద్దరు కుమార్తెలు చదవడానికి ఒక్కొక్కరికి 2.5 లక్షల చొప్పున మొత్తం రూ 5. లక్షలు డిపాజిట్ చేశానని తెలిపారు. డిపాజిట్ చెల్లించే సమయంలో విద్యార్థుల చదువు అయిపోయిన తర్వాత డిపాజిట్ అమౌంట్ తిరిగి ఇస్తామని తెలిపి ఇప్పుడు ఇవ్వడం లేదని గత మూడు సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారని, కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని అమౌంట్ ఇప్పించాలని ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

