Tv424x7
Andhrapradesh

నెరవాటి హాస్పిటల్ లో మహిళ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి—

DMHO జిల్లా కలెక్టర్ గారు స్పందించి నేరవాటి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తెససుకోకపోతే AIYF గా ప్రత్యక్ష ఉద్యమలకు సిద్ధం అవుతాం.

అధికార యంత్రాంగనికి హెచ్చరించిన AIYF జిల్లా కార్యదర్శి నాగరాముడు.

నంద్యాల కలెక్టర్ గారికి పిర్యాదు చేసి, DMHO గారికి వినతి పత్రం అందజేసిన.

AIYF జిల్లా కార్యదర్శి నాగరాముడు

ఈ సందర్భంగా AIYF జిల్లా కార్యదర్శి జినాగరాముడు మాట్లాడుతూ వైద్యం నిర్లక్ష్యం చేసినటువంటి డాక్టర్ పై, నేరవాటి హాస్పిటల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ లో నిండు గర్భిణీ స్త్రీ యొక్క ప్రాణాలు పోయినప్పటికి ఎటువంటి చర్యలు లేకపోవడం ప్రభుత్వ అధికారులే ఆత్మ విమర్శచేసుకోవాలని వారన్నారు. నెరవాటి హాస్పిటల్ లోజరిగినటువంటి సంఘటన మరి ఏ హాస్పిటల్లో జరగకుండా ఉండే విధంగా నేరవాటి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని చెందిన కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఉండాలని వారు తెలిపారు.

ఉదాహరణకు
నెరవాటి హాస్పిటల్ యజమాన్యం మరియు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అయిందని మృతి చెందిన మహిళ కుటుంబాని50 లక్షలు హాస్పిటల్ యాజమాన్యమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఏ ప్రైవేట్ హాస్పిటల్ లో అయినా ఇలాంటి సమస్య తలెత్తకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా థియేటర్లను తలపించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద రోగుల ప్రజల నుంచి వేలాది రూపాయలను తీసుకొని హాస్పిటల్ కి వెళితే ఓపీలంటూ ,చెకప్పులంటూ స్కానింగ్ అంటూ అడ్వాన్స్ టెక్నాలజీ,అంటూ పుట్టగొడుగుల రోజుకు ఒక హాస్పిటల్ నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నప్పటికీ డీఎంహెచ్వో గారు హాస్పిటల్కు ఎటువంటి నిబంధన లేకపోయినా చూసి చూడనట్టుగా వ్యవహరించడంచాలా బాధాకరమన్నారు.ఇప్పటికైనా స్పందించి డిఎంహెచ్వో గారు ప్రైవేట్ హాస్పిటల్ ను విజిట్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలనిఅప్పుడే నిజమైన పేద రోగులకు వైద్యం అందుతుందని వారు తెలిపారు.

కేవలం డబ్బు కోసమే హాస్పిటల్లో నెలకొల్పి తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తూ అత్యధిక సౌకర్యాలతో మా హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తామని బయట బోర్డులు పెట్టి వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజల యొక్క రోగమే తమ ఆయుధముగా భావిస్తూ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని
ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు మరింత తీవ్రతం చేస్తామని పేద రోగుల అండగా ఉంటామని ఏఐవైఎఫ్ గా తెలియజేస్తున్నమ్మన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మధు ,పాములేటి, భాష, తదితరులు పాల్గొనడం జరిగింది.

Related posts

నేడే జనసేన – టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక హామీలూ, అంశాలూ ఇవే

TV4-24X7 News

మావోయిస్టులపై కఠిన వైఖరి – 2026 మార్చి నాటికి దేశం మావోయిజం లేని దిశగా!

TV4-24X7 News

బైపాస్ రోడ్డు పేరుతో వనిపెంటరైతుకుటుంబాల ఉపాధి మీదదెబ్బ కొట్టాలనుకోవడం దారుణం : ఏవి. రమణ

TV4-24X7 News

Leave a Comment