దేశంలో మావోయిజం నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
“2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ముప్పు పూర్తిగా అంతమవుతుంది. మావోయిస్టులతో మాట్లాడ్డానికి ఏమీ లేదు. వారు నిజంగా శాంతి కోరుకుంటే ఆయుధాలు వదిలి లొంగిపోవాలి. అలా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం పునరావాస సౌకర్యాలు కల్పిస్తుంది,” అని ఆయన స్పష్టం చేశారు.
అమిత్ షా హెచ్చరిస్తూ, “శాంతికి విఘాతం కలిగించే వారిపై తగిన సమాధానం ఇస్తాం,” అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, రహదారి నిర్మాణం, విద్య, వైద్య సేవలను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

