Tv424x7
Andhrapradesh

చంద్రబాబు, అమరావతి గ్రాఫిక్స్ మాదిరిగా నంద్యాల మెడికల్ కాలేజీ గ్రాఫిక్స్ కాదు – ఎమ్మెల్సీ ఇసాక్ బాష.!!


నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం అడ్మిషన్లు పూర్తయ్యాయి. కానీ, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం తరగతులు ఇంకా ప్రారంభం కాలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత గారు కూడా కాలేజీ లేదంటూ విజువల్ చూపించడం విచిత్రం. అసలు ఏ శాఖలో ఎవరు ఉన్నారో తెలియని గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉంది” అని మండిపడ్డారు.

నిజానికి నంద్యాల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని అడ్డుకున్నవారు టీడీపీ నాయకులేనని ఆయన ఆరోపించారు. “ఈ కాలేజీ నిర్మాణం కోసం హైకోర్ట్ వరకు వెళ్లాల్సి వచ్చింది. అభివృద్ధి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని అమ్ముకోవాలని చూస్తోంది. ప్రజల కష్టాన్ని దోచుకోవడం తగదు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పి.పి. నాగిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిస, నంద్యాల నియోజకవర్గ ఉపాధ్యక్షులు అమీర్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

TV4-24X7 News

తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

TV4-24X7 News

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి: TTD

TV4-24X7 News

Leave a Comment