ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నారు. జీఓ – 117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు

next post