▪️ ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్
2025 – 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి. ఇందులో మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలెక్ట్రిక్ ఆటో, పాసింజర్ కార్ (4 వీలర్), గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.