Tv424x7
Andhrapradesh

కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం

పశ్చిమగోదావరి జిల్లాగుండాల చంద్రశేఖర్ అనే వ్యక్తి పాలకొల్లులోని కటికిరెడ్డివారి వీధిలో ఉంటున్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్, లైంగిక సామర్థ్యం కోసం వినియోగించే sildenafil citrate, tadlafil citeate వంటి మందులు, unwanted -72, alplagdam 0.5 వంటి టాబ్లెట్లు విక్రయిస్తున్నాడు. మొత్తం 11 రకాల మందులు అతని వద్ధ దొరకగా వాటి అసలు విలువ అంటే ఎంఆర్‌పీ ప్రకారం 16 వేల రూపాయలు ఉంటుంది. అయితే ఇక బ్లాక్ మార్కెట్ లో రెట్టింపు ధరకు వీటి విక్రయాలు జరుగుతున్నాయి. రాజమండ్రి కి చెందిన ఒక మెడికల్ షాపు నుంచి పెద్ద మొత్తం లో వీటిని కొనుగోలు చేసి నిందితుడు గోప్యంగా విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీలో తేలింది. దీంతో సమాచారం అందుకున్న డ్రగ్స్ అధికారులు దాడి చేసి చీకటి దందాకు చెక్ పెట్టారు. సరుకును సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేపట్టారు.ఇప్పటికే ఈగల్ టీం ద్వారా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మందులు దుకాణాలపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి సుమారు 150 కి పైగా కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఇపుడు అధికారులు దృష్టి ఇల్లీగల్ మందులు వ్యాపారులపై పడింది. వరుస తనిఖీలతో నిందితులపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

Related posts

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్

TV4-24X7 News

వైసీపీలోకి మారలేదని తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు

TV4-24X7 News

కందుల ఆధ్వర్యంలో కళ్లద్దాలు పంపిణీ మహిళ కార్యకర్తలకు చీరల పంపిణీ

TV4-24X7 News

Leave a Comment