విశాఖపట్నం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్అంబేద్కర్ 134 వ జయంతిని పురస్కరించుకొని విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ ఆదేశాల మేరకు 29వ వార్డు పరిధిలో వెంకటపతిరాజునగర్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 29వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు ఉరికిటి గణేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఉరికిటి గణేష్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టినా, సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.అనంతరం స్థానిక పెద్దలను సన్మానించి స్థానిక నిరుపేద మహిళలకు తెలుగుదేశం కమిటీ సభ్యులచే చీరలు అందజేసినారు, అలాగే పెంట వీధి బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారు రాజు, బండి అప్పలరాజు, పిల్లల గోపమ్మ, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
