బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. “బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారని నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, ఇంకా.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాము.” అని సదరు పోస్టులో లోకేష్ చెప్పారు.

previous post