Tv424x7
Telangana

త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

*త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

(విభాగాల వారిగా భర్తీల వివరాలు దిగువన) తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మహా లక్ష్మి పథకం కింద కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కాగా, పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుద్యోగు లకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను.. జాబ్ క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుంది.. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

మొత్తం ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలు..

డ్రైవర్ -2000

శ్రామిక్ -743

డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84

డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114

డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25

అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23

సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11

అకౌంట్ ఆఫీసర్స్ – 6

మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7

మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7

Related posts

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

TV4-24X7 News

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు

TV4-24X7 News

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

TV4-24X7 News

Leave a Comment