Tv424x7
Andhrapradesh

మీది బలిజ సంఘమా ? లేక వైస్సార్సీపీ అనుబంధ సంఘమా..?

తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ కార్యదర్శి బొజ్జ మైసూరా రెడ్డిపులివెందులలో దేవర శిలబండి పోవు విషయము ,సెంట్రల్ బోలె వార్డ్ వలన కలుగుతున్న ఇబ్బందులఫై స్పందించిన బలిజసంగం నాయకులు ఆ సంఘం తరపున మాట్లాడారా లేక వైస్సార్సీపీ అనుబంధ నాయకులుగా మాట్లాడారా అని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి ప్రశ్నిస్తున్నాడు.ప్రశ్నించింది ప్రతిపక్ష శాసనమండలి సభ్యుడు ,సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వ అధికారులు లేక అధికార పార్టీ నాయకులు ,మధ్యలో మీకేం సంబంధమో సమాధానం చెప్పాలని అడుగుతున్నాము .విలేఖరుల సమావేశం పెట్టిన వారిలో చాలా మంది రామగోపాల్ రెడ్డి వద్దకు వచ్చి వైస్సార్ కుటుంబీకులు హిందువులకు అన్యాయం చేస్తున్నారు ,మాకు ప్రశ్నించే శక్తి లేదు మీరయినా మాట్లాడండి అని అడిగిన విషయం వాస్తవమా కాదా అని చెప్పాలని డిమాండ్ చెస్తున్నాము .మీరు ఈ విషయం మీద కాదని మీకు నచ్చిన దేవుని మీద ప్రమాణం చేస్తారా అని అడుగుతున్నాము .మీరు మా దగ్గరికి వచ్చిన విషయం నిజమని మేము ప్రమాణం చేస్తాము .మీరు బలిజలందరికి ప్రతినిధులు కాదు ,మీరు మీ పదవులను డబ్బులు పెట్టి కొనుక్కున్నవారు.పులివెందుల బలిజలకు టీడీపీ కి విడదీయరాని బంధం వుంది.సంఘం మీ వారి అభివృద్ధి కోసం పని చేయాలి.రాజకీయాలతో మీకేం పని. గరండాల వంక ఆక్రమణలకు గురికాలేదని మీరు సర్టిఫికెట్ ఇస్తారా అని అన్నారు.సెంట్రల్ బోలె వార్డ్ అంటే ఏందో మీకు తెలుసా అని ప్రశ్నించారు.గత రెండు సంవత్సరాలుగా మెయిన్ బజార్ లో వ్యాపారాలు జరుగుతున్నాయా కొంచమైనా ఆలోచించండి.మీరేమయినా వాళ్లకి ప్రతినిధిలా లేక పార్టీ నాయకులా.మీరు మేము అభిమానించే శ్రీ కృష్ణదేవరాయల జయంతిని వైస్సార్సీపీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు కదా మరి ఆరోజు సంఘం పెద్దలు ఎక్కడకి పోయారు .మీరు బలిజలకు ప్రతినిధులా లేక వైఎస్ కుటుంబీకులకు ప్రతినిధులా ?2010 లో పాత సంత మార్కెట్ లో కట్టిన షాపింగ్ రూములు పది సంవత్సరాలకే పనికి రాకుండా పోయాయా ?కట్టడాల క్రింద దేవర సిలబండి పోయేది సంప్రదాయమా అది వూరికి అరిష్టం కాదా ప్రతి సారి జరుపుతున్న దేవరకు ఎన్ని లక్షల చందాలు వసూలు చేస్తున్నారు యెంత ఖర్చుపెడుతున్నారు ఏ రోజయినా జమా ఖర్చులు ప్రజలకు చెప్పారా ల్లక్షలాది రూపాయలను వసూలు చేసి దోచుకు తింటున్నది వాస్తవం కాదా జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేవర పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం.బలిజ సంఘం నాయకులు రాజకీయాలు మాని మీ సంఘ ప్రజల బాగోగుల కోసం పని చేయమని కోరుతున్నాము.మీరు రాజకీయాలు చేస్తే మీ సంఘంలో ఎలా రాజకీయాలు చేయాలో మాకు తెలుసు.ఈ కార్యక్రమంలో ఓ వి రమణా రెడ్డి రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి, టి .వెంకటేశ్వర్ రెడ్డి పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు.

Related posts

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

TV4-24X7 News

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News

Leave a Comment