పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. గురువారం ఆయన బీహార్ పర్యటనకు వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో..రూ.13,480 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని.. ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. అలాగే తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ.. ” పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గాం ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపై జరిగింది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వాళ్లలో అన్న రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉగ్రవాదులకు సహకరించిన సూత్రధారులను కూడా వదలిపెట్టమని” ప్రధాని మోదీ అన్నారు.

previous post
next post