Tv424x7
National

ఆపరేషన్ సింధూర్‌’ టీజర్ మాత్రమే.! అసలు సినిమా ముందుంది

ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్‌ వెన్నులో వణుకు పుట్టించింది భారత్. అర్ధరాత్రి 1.44 గంటలకు పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత్ ఆర్మీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ చేపట్టిన ఈ వైమానిక దాడులతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఈ స్ట్రైక్స్ కేవలం టీజర్ మాత్రమేనని.. ఇది ‘ఆపరేషన్ సింధూర్‌’ మొదటి దశ మాత్రమేనా.! త్వరలో మరిన్ని దాడులు ఉండొచ్చంటూ సైన్యం నుంచి సంకేతాలు అందుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పాక్‌ టెర్రరిస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌ల ధ్వంసంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు.అటు పాకిస్తాన్, పీఓకేలోని టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్’పై మిత్ర దేశాలకు భారత్‌ సమాచారం అందించింది. దాడుల అనంతరం అమెరికా, యూకే, రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ సహా.. పలు దేశాల ప్రతినిధులకు, సీనియర్ అధికారులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్‌ క్యాంప్‌లపై దాడికి కారణాల్ని వివరించారు. టెర్రరిజాన్ని అంతమొందించాలనే ఈ స్ట్రైక్స్ చేసినట్టు వివరించారు. ప్రక్ ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని చెప్పారు.

Related posts

మోదీ నూతన సంవత్సర కానుక… పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్.

TV4-24X7 News

పెళ్ళిలో మనం చేస్తున్నా అతి పెద్ద తప్పేంటో తెలుసా..?

TV4-24X7 News

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

TV4-24X7 News

Leave a Comment