సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఇండియా, పాక్ దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారతదేశం , పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని, ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడకూడదని ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ , మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపి, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు.ఇకపై ఒక్క బుల్లెట్ కూడా సరిహద్దులు దాటకూడదని, శత్రుత్వాన్ని పెంచే చర్యలకు స్వస్తి పలకాలని ఇరు దేశాలు తీర్మానించాయి.కాల్పుల విరమణ తర్వాత రెండు రోజుల్లోనే ఈ చర్చలు జరగడం, అందులో పాకిస్తాన్ సానుకూలంగా స్పందించడం మరింత ఆశాజనకంగా ఉంది. పాకిస్తాన్ డీజీఎంఓ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించబోమని, ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడబోమని స్పష్టం చేసింది.భారత ఆర్మీ ఈ చర్చల సారాంశాన్ని అధికారికంగా ట్విట్టర్‌లో తెలియజేయడం జరిగింది. ఈ ఒప్పందం నిలకడగా కొనసాగడానికి ఇరు దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయో చూడాలి. బలగాల ఉపసంహరణపై చర్చలు జరగడం కూడా సానుకూల పరిణామమే.చర్చల సమయంలో పాకిస్తాన్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫెన్స్ మోడ్‌లో ఉందని అధికారులు అంటున్నారు. అందుకే పాకిస్తాన్ దూకుడుగా వెళ్లేందుకు అవకాశం లేదనే చర్చ నడుస్తోంది.

previous post
next post